Kishan Reddy: తెలంగాణలో వాళ్ళ ఓట్లు తొలగించాల్సిందే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు.

Kishan Reddy stated that Bangladesh, Myanmar nationals votes removed from voters list in Hyderabad's Old City

  • రేవంత్‌కు ఉద్యోగులపై నమ్మకం లేదు
  • అక్రమ వలసదారుల ఓట్ల తొలగింపు
  • కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల పచ్చిమోసం

Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్వోలుగా (BLO) సేవలందిస్తున్నది తెలంగాణ ఉద్యోగులు కాదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా పాతబస్తీలో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన అక్రమ వలసదారులు ఉన్నారని, వారెవరూ భారతీయులు కాదని స్పష్టం చేశారు. అలాంటి వారి పేర్లను ఓటర్ల జాబితాలో ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

Randhir Jaiswal: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. ఘాటుగా స్పందించిన రణధీర్ జైస్వాల్

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి పచ్చిమోసం చేశాయని, ఆ రెండు కూడా అవినీతి పార్టీలేనని కిషన్ రెడ్డి(Kishan Reddy) మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజా సంక్షేమం కోసం తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, దీనిపై విపక్షాలు రాజకీయ స్వార్థంతో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.