Randhir Jaiswal: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. ఘాటుగా స్పందించిన రణధీర్ జైస్వాల్
ఇతరులపై నిందలు వేయడం మానేసి, సొంత భూభాగంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) సూచించారు.
Randhir Jaiswal responded to the terrorist attack on the Sindh Rangers headquarters in Karachi
-
కరాచీ రేంజర్స్ స్థావరంపై ఉగ్రదాడి
-
పాకిస్తాన్ ఆరోపణలను తిరస్కరించిన భారత్
-
సొంత ఉగ్రవాదంపై చర్యలకు డిమాండ్
Randhir Jaiswal: పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై శనివారం సాయంత్రం ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. గులిస్తాన్-ఇ-జౌహర్ ప్రాంతంలో ఉన్న ఈ స్థావరం ప్రధాన గేటును వాహనంతో ఢీకొట్టి, గ్రెనేడ్లు విసురుతూ లోపలికి చొరబడ్డారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరీ కాల్పుల్లో నలుగురు రేంజర్స్ సిబ్బంది మరణించగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘోర దాడికి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) అనుబంధ సంస్థ జమాత్-ఉల్-అహ్రార్ బాధ్యత వహించింది.
AP Government: వంట కార్మికులకు శుభవార్త.. బకాయిలు విడుదల, నేరుగా ఖాతాల్లోకి నగదు
అయితే, ఈ ఉగ్రదాడి వెనక భారత్ హస్తం ఉందంటూ పాకిస్తాన్ యథావిధిగా నిరాధార ఆరోపణలకు దిగింది. పాక్ ప్రభుత్వం, అక్కడి మీడియా చేస్తున్న ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ పూర్తిగా కల్పితాలని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని స్పష్టం చేసింది.
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) మాట్లాడుతూ.. ఇతరులపై నిందలు వేయడం మానేసి, సొంత భూభాగంలో ఏళ్ల తరబడి సాగుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా ఉపయోగించుకునే ప్రమాదకర ధోరణిని పాక్ ఇకనైనా విడనాడాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
