Telangana Politics: నేను ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ బాత్రూంలు కడుగుతుండే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

పంట నష్టానికి ఇస్తామన్న పది వేల రూపాయలు ఏవని నిలదీశారు. తనకు ఎంపీ ,ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, తనకు బతుకు తెలంగాణ కావాలని కోమటిరెడ్డి అన్నారు.

Komatireddy Venkatareddy: కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు బీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ అమెరికాలో బాత్రూంలు కడుగుతుండేవారంటూ వ్యాఖ్యానించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుంది కేసీఆర్ ని ప్రశ్నించిన ఆయన.. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

Hyderabad: దేశం మొత్తం చూపు హైదరాబాద్‌ రియాల్టీ వైపే.. ఇప్పటికీ అందుబాటులోనే ఇళ్ల ధరలు

కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదని, వడ్డీ మాత్రమే మాఫీ అని అన్నారు. పంట నష్టానికి ఇస్తామన్న పది వేల రూపాయలు ఏవని నిలదీశారు. తనకు ఎంపీ ,ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, తనకు బతుకు తెలంగాణ కావాలని కోమటిరెడ్డి అన్నారు. తనకు వ్యాపారాలు లేవని, గుట్టలు, కొండలు అమ్ముకోనని అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి గందమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించించారని, ఔటర్ రింగ్ రోడ్డు ను కాంట్రాక్టర్లు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేశారిని సీఎం కేసీఆర్ మీద ధ్వజమెత్తారు.

Shehla Rashid: ఆర్టికల్-370 మీద స్వరం మార్చిన షీలా రషీద్.. కశ్మీర్ ఇప్పుడు సూపర్ ఉందంటూ మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు

ఇక సొంత పార్టీ గురించి మాట్లాడుతూ.. పార్టీలోని కాంట్రాక్టర్లు , రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బలహీన వర్గాల ప్రజల గొంతుకగా తాను ఉంటానని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కోమటిరెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు