Krishna River Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం

కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంది. అప్పట్లో కృష్టా జలాల విషయంలో సరైన వాటా లేదనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు వేసింది.

Krishna River Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంది. అప్పట్లో కృష్టా జలాల విషయంలో సరైన వాటా లేదనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు వేసింది.

కృష్ణా జలాల వాటా కోసం కొత్త ట్రిబ్యునల్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కోరింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తోన్న నేపథ్యంలో అలా చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. అపెక్స్ కౌన్సిల్ తీర్మానం మేరకు తెలంగాణ కేసు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

ఈ మేర కేసు ఉపసంహరించుకున్నట్లు లేఖ ద్వారా కేంద్రానికి తెలియజేసింది తెలంగాణ. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కాకుండా.. 1956 చట్ట ప్రకారం విభజన జరగాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు వస్తుండగా తెలంగాణకు 299 టీఎంసీల నీరు మాత్రమే తాత్కాలికంగా కేటాయిస్తూ వస్తున్నారు.

ఈ సమస్యనే పరిష్కరించి వాటాలను సరి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించుకుంది.

ట్రెండింగ్ వార్తలు