పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్‌తో భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

స్పీకర్ పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. సరియైన నిర్ణయం స్పీకర్ తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

BRS MLAs presenting petition to Speaker Gaddam Prasad

KTR : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ కు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని ఎమ్మెల్యేలు స్పీకర్ కు పిటీషన్ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

Also Read : Balineni Srinivas : అన్ని విషయాలను త్వరలో బయట పెడతా.. బాలినేని సంచలన వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. మూడు నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సూచనలు ఉన్నాయని, అన్ని అంశాలను వివరిస్తూ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మణిపూర్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేపై తీసుకున్న నిర్ణయాన్ని మేము ప్రస్తావించామని, జనవరి 2020లో మణిపూర్ ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చామని తెలిపారు.

Also Read : పెరిగిపోతున్న పెళ్లిళ్ల ఖర్చు.. దేనికి ఎంత పెడుతున్నారో తెలుసా.. రోల్డ్‌ గోల్డ్‌తో కానిచ్చేస్తున్నారా‌?

హర్యానాలో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ కోరుతుంది. పార్టీ ఫిరాయింపులు తనకు ఇష్టం లేదని స్పీకర్ ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. స్పీకర్ పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. సరియైన నిర్ణయం స్పీకర్ తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు ఫోన్ చేసి పార్టీ మారకపోతే ప్రాణగండం ఉందని హెచ్చరించారు. ఇది దారుణమైన విషయం. ఎమ్మెల్యేల సొంత వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయి. బడే బాయ్, చోటే బాయ్ కి తేడా లేదు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిలు పార్టీ మారకపోతే ప్రజాప్రతినిధులను వేధిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాకు సానుభూతి ఉందన్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పిన కడియం శ్రీహరి ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

ట్రెండింగ్ వార్తలు