KTR
మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన రోజులు దగ్గర పడ్డాయని, ఈ నెల 29న అన్ని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తామని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అప్పట్లో కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని అన్నారు. అందరినీ కదిలించిన దినం దీక్షా దివస్ అని అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు ఉన్న పరిస్థితి నేడు కనిపిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఇలా ఉంటుందా? అని అందరూ బాధ పడుతున్న రోజులు చూస్తున్నామని చెప్పారు. రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతామని, దీక్షా దివస్ విజయవంతం చేసేందుకు ఇంచార్జ్ ల నియామకం ఉంటుందని తెలిపారు.
మరోవైపు, లగచర్ల ఘటనను నిరసిస్తూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ పాల్గొనే ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్ లో జరిగే బీఆర్ఎస్ మహాధర్నా సభా స్థలిని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్ , పార్టీ నేత లతో కలిసి పరిశీలించారు.
అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దయాకర్ రావు మాట్లాడుతూ… దీక్షకు ఎట్లా వెళ్తారో చూస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని చెప్పారు. ఫార్మా ఇండస్ట్రీ నుంచి కారిడార్ గా యూటర్న్ తీసుకున్నారని, మొత్తం రద్దు చేసేవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని తెలిపారు.
అప్పటివరకు దేశంలో ఏ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయం: మాయావతి కీలక ప్రకటన