KTR : 117 స్థానాల్లో గెలుస్తామన్న రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. హరీశ్ రావు ప్రస్తానపై ఘాటు వ్యాఖ్యలు..
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కేసీఆర్ మీద కోపంతో కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.ప
- Harish Thanniru
- Updated on- July 11, 2026 / 05:03 PM IST
KTR Comments On Revanth Reddy
- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
- 117కాదు.. ఏడు స్థానాలుకూడా రావు
- ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి
KTR Comments On Revanth Reddy : రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయి.. 117 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారని.. రెండోసారి అధికారంలోకి రావడం పక్కా.. ఇది భద్రాచలం రాముడి మీద ఆన అంటూ సీఎం రేవంత్ రెడ్డి మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read : Boat Capsizes : వియత్నాంలో భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా.. ఏపీ టూరిస్టులతోసహా పలువురు మృతి
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను ఈ మాట అనొద్దు కానీ తప్పడం లేదు.. రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు తెలంగాణకు అన్యాయం చేస్తుండు.. అధికారులు, ఇంజనీర్లు చెబుతున్న మాటలను కూడా పట్టించుకోని రేవంత్ రెడ్డిని బుర్ర తక్కువోడు అనాలా, దరిద్రుడు అనాలా, సన్నాసి అనాల. ఇదికాలం తెచ్చిన కరువు కాదు.. కేసీఆర్ మీద కోపంతో, కక్షతో కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి చేసుకున్న సొంత సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78కి పై సీట్లతో అధికారంలోకి వస్తుందని సర్వే రిపోర్ట్ ఇచ్చింది. రేవంత్ సర్వేతో పాటు ఇంకా నాలుగు సర్వేలు చేశారు.. అవన్నీ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి. కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు వస్తాయట.. 117 కాదు ఏడు సీట్లు కూడా రావు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదు అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు.
రాష్ట్రంలోని 77 శాతం రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నప్పటికీ గోదావరి వరద జలాలను వినియోగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. గోదావరిలో రోజుకు సుమారు 9 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, కన్నేపల్లి పంప్‌హౌస్‌ల వద్ద మోటార్లు ప్రారంభిస్తే రోజుకు 2 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీని ఉపయోగించకుండానే కన్నేపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కూడా స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
మేడిగడ్డ గేట్లు దించితే భద్రాచలం శ్రీరామాలయానికి ముప్పు వస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. భారీ వరదలను తట్టుకున్న మేడిగడ్డ, లక్ష క్యూసెక్కుల వరదకు కొట్టుకుపోతుందనడం సరైన అవగాహన లేక చేసిన వ్యాఖ్యలేనని కేటీఆర్ విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతోందని, పంపులను ప్రారంభిస్తే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అసత్యమని ప్రజలకు తెలిసిపోతుందని అందుకే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి రాజకీయ కక్షతో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న విషయాన్ని గుర్తుచేసిన కేటీఆర్.. తెలంగాణలో మాత్రం అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రభుత్వం వినియోగించడం లేదన్నారు. ముఖ్యమంత్రికి కోపం ఉంటే తమపై కేసులు పెట్టవచ్చని, కానీ రైతుల ప్రయోజనాలను దెబ్బతీయవద్దని కేటీఆర్ కోరారు. హరీష్ రావు తాను కేసీఆర్ సైనికుడని పదే పదే చెబుతున్నారు.. అయినా సీఎం రేవంత్ రెడ్డి అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
