×
Ad

దుర్మార్గుడు కాలితో తంతే ఆ పాప చనిపోయింది.. అలాంటి దుర్మార్గులను..: కేటీఆర్ ఫైర్

"అసలు సిగ్గు ఉందా నాగర్ కర్నూల్ పోలీసులకు? బిడ్డతో పాటే రాజ్యాంగాన్ని ఖననం చేసింది నిజం కాదా? రెండు నెలల పసిగుడ్డుకు కులం, మతం, అధికారం ఏం తెలుసు?" అని అన్నారు.

  • కుమ్మెర జాతరలో 3 నెలల చిన్నారి మృతి
  • హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా దోషులే
  • దుర్మార్గులను శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు?

KTR: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర జాతరలో మూడు నెలల చిన్నారి మృతి ఘటనపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతూ.. కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.

దర్శనం, దండం పెట్టుకునే అవకాశం అడిగారని, ఆ మాత్రానికే దారుణానికి పాల్పడ్డారని కేటీఆర్ అన్నారు. “హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా దోషులే… ఆది సీఎం అయిన ఇంకెవరైనా సరే. దుర్మార్గుడు కాలితో తంతే ఆ పాప చనిపోయింది. అలాంటి దుర్మార్గులను శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు?

Also Read: Somireddy: మదనపల్లి ఫైల్స్‌కు మించి సర్వేపల్లి ఫైల్స్.. నేరుగా ఆయన రంగంలోకి దిగాల్సిందే: సోమిరెడ్డి

పోలీసులకు ఉద్యోగం ఇచ్చింది రాష్ట్రం, జీతం ఇచ్చేది రాష్ట్ర ప్రజలు. బాధితులు పీఎస్‌కు వస్తె ఫిర్యాదులో తప్పులు ఉన్నాయని చెబుతారా?సుమోటోగా కేసు నమోదు చేయాలి. అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి ఫిర్యాదు వచ్చిందని చెబుతారా? పాప చనిపోతే పెట్టాల్సింది హత్య కేసు కదా?

అసలు సిగ్గు ఉందా నాగర్ కర్నూల్ పోలీసులకు? బిడ్డతో పాటే రాజ్యాంగాన్ని ఖననం చేసింది నిజం కాదా? రెండు నెలల పసిగుడ్డుకు కులం, మతం, అధికారం ఏం తెలుసు?” అని అన్నారు.