Telangana Polls Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ తొలి స్పందన ఏంటంటే?

ఇదే సందర్భంలో అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ‘‘స్పష్టమైన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. అలాగే వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రెండుసార్లు భారత్ రాష్ట్ర సమితి పార్టీకి అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ప్రస్తుత ఫలితాల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమి చాలా నిరాశపరిచిందని ఆయన రాసుకొచ్చారు. వాస్తవానికి ప్రస్తుత ఫలితాల గురించి బాధపడట్లేదని, అయితే తాము ఆశించిన స్థాయిలో లేకపోవడం అత్యంత నిరాశ కలిగించిందని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం కాగానే తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

“బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు ఫలితాల గురించి బాధపడట్లేదు. కాకపోతే మేము ఆశించిన స్థాయిలో ఈ ఫలితాలులేకపోవడం నిరాశ పర్చింది. కానీ మేము దీన్ని పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తాం’’ అని రాసుకొచ్చారు. ఇదే సందర్భంలో అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ‘‘స్పష్టమైన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. అలాగే వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.