DCP Ritiraj – Bandi Bhagirath Case: కచ్చితంగా అరెస్ట్ చేస్తాం..! బండి భగీరథ్ కేసుపై డీసీపీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ ఆదేశాలతో బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ను అధికారిగా నియమించారు.
- Naveen
- Published on- May 11, 2026 / 11:06 PM IST
DCP Ritiraj – Bandi Bhagirath Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. సిట్ విచారణ అధికారిగా ఉన్న కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ తన బృందంతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. భగీరథ్ పై నమోదైన కేసు వివరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసినప్పటి నుండి జరిగిన విచారణ గురించి అడిగి తెలుసుకున్న డీసీపీ. కేసులో ఇప్పటికే చాలా వివరాలు సేకరించామన్న డీసీపీ రితిరాజ్ తదుపరి విచారణను మరింత వేగవంతం చేస్తామన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ ఆదేశాలతో బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ను అధికారిగా నియమించారు. ఆమె నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతోంది. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి బండి భగీరథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
”మైనర్ భాదితురాలు స్టేట్ మెంట్ ఒకసారి రికార్డ్ చేశాం. ఇక ముందు కూడా వారి స్టేట్ మెంట్స్ తీసుకునే అవసరం ఉంది. పొలిటికల్ గా ఎలాంటి ఒత్తిడి లేదు. సీపీ ఆర్డర్స్ ప్రకారం మేము విచారణ చేస్తున్నాం. కేసు దర్యాప్తులో బండి భగీరథ్ తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా అరెస్ట్ చేస్తాం” అని డీసీపీ రితిరాజ్ తేల్చి చెప్పారు.
Also Read: బండి సంజయ్ కుమారుడి కేసుపై సిట్.. సీఎం రేవంత్ పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
