L Ramana : టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న రమణ
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రగతి భవన్ కి వచ్చిన రమణ.. కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
- kunduru Vinod
- Published On : July 12, 2021 / 03:08 PM IST
L Ramana (2)
L Ramana : టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రగతి భవన్ కి వచ్చిన రమణ.. కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎల్. రమణ టీటీడీపీకి రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన నాలుగు రోజుల తర్వాత టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఇక ఈ నెల 16న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయనతోపాటు జనగామకు చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు.. ఆయన అనుచరులు ఇదే రోజు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి సోమవారం హుజురాబాద్ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ మారే విషయమై వారితో చర్చించనున్నారు.
