Land Value increased : భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?

Land Value increased : ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువకు, బేసిక్ రిజిస్టర్ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి విలువలు పెంచారు.

Land Value increased

Land Value increased : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు సవరించిన విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి గత నెలలోనే కొత్త విలువలు అమల్లోకి రావాల్సి ఉన్నా.. వ్యవసాయ భూముల అప్‌లోడ్ ప్రక్రియలో కొంత గందరగోళం కారణంగా ఆలస్యమైంది. దీంతో జూన్ 5వ తేదీ నుంచి భూముల కొత్త విలువలు అమల్లోకి వచ్చాయి. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత భూముల విలువలను సవరించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2021, 2022 సంవత్సరాల్లో ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు భూముల విలువ సవరించింది.

Also Read : Land prices increased : భూముల రేట్లు డబుల్.. మీ ఏరియాలో ఎంత పెరిగాయి? ఇలా చెక్ చేసుకోండి..

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువకు, బేసిక్ రిజిస్టర్ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఈసారి విలువలు పెంచారు. కనిష్టంగా 15 శాతం, గరిష్ఠంగా 100శాతం పెంచడం గమనార్హం. అయితే, బహిరంగ మార్కెట్ కు, బేసిక్ రిజిస్టర్ విలువకు మధ్య పెద్దగా తేడాలేని ప్రాంతాల్లో భూముల విలువలో ఎలాంటి మార్పులు చేయలేదు. తాజాగా.. భూముల విలువ పెంపు ద్వారా ప్రభుత్వానికి ప్రతీయేటా కనీసం రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లో సవరించిన ప్లాట్ (చదరపు గజం) విలువను పరిశీలిస్తే..
♦ కోకాపేట ఏరియాలో : పాత విలువ రూ.23,800, కొత్త విలువ రూ.47,600
♦ అత్తాపూర్ ఏరియాలో : పాత విలువ రూ.20,300, కొత్త విలువ రూ.30,500.
♦ కొంపల్లి ఏరియాలో : పాత విలువ రూ.11,600, కొత్త విలువ రూ.17,400.
♦ కొండాపూర్, మాదాపూర్ ఏరియాల్లో : కొత్త విలువ రూ.78,600
♦ గచ్చిబౌలి, మియాపూర్ ఏరియాల్లో : కొత్త విలువ రూ.78,600.
♦ కూకట్‌పల్లి, హైదర్‌నగర్ ఏరియాల్లో : కొత్త విలువ రూ.67,400
♦ మూసాపేట్, భరత్‌నగర్ ఏరియాల్లో : కొత్త విలువ రూ.67,400.

హైదరాబాద్‌లో అపార్టుమెంట్‌లో (చదరపు అడుగు) విలువను పరిశీలిస్తే..
♦ కొంపల్లి ఏరియాలో : పాత విలువ రూ.2,200, కొత్త విలువ రూ.2,700
♦ బాలానగర్ ఏరియాలో : పాత విలువ రూ.2,500, కొత్త విలువ రూ.3,000.
♦ పటాన్ చెరు ఏరియాలో : పాత విలువ రూ.2,500, కొత్త విలువ రూ.3000.
♦ మాసబ్‌ట్యాంక్ ఏరియాలో : పాత విలువ రూ.2,500, కొత్త విలువ రూ.2,700.
♦ అజంపురా ఏరియాలో : పాత విలువ రూ.2,500, కొత్త విలువ రూ.2,700.
♦ మోకిల ఏరియాలో : పాత విలువ రూ.2,200, కొత్త విలువ రూ.2,700.

హైదరాబాద్ లో ఎకరా భూమి విలువ (100శాతం వరకు పెంపు)
♦ హఫీజ్ పేట్ ఏరియాలో : పాత విలువ రూ.11కోట్లు, కొత్త విలువ రూ. 18కోట్లు
♦ నాగోల్ ఏరియాలో : పాత విలువ రూ.11కోట్లు, కొత్త విలువ రూ.20కోట్లు.
♦ రాయదుర్గం ఏరియాలో : పాత విలువ రూ.9కోట్లు, కొత్త విలువ రూ.15కోట్లు
♦ బుద్వేల్ ఏరియాలో : పాత విలువ రూ.5.5 కోట్లు, కొత్త విలువ రూ.8.25కోట్లు
♦ కోకాపేట ఏరియాలో : పాత విలువ రూ.30లక్షలు, కొత్త విలువ రూ.60లక్షలు.
♦ కొంగరకలాన్ ఏరియాలో : పాత విలువ 15లక్షలు, కొత్త విలువ రూ.30లక్షలు

జిల్లాల్లో ఎకరా భూమి విలువ (50-75శాతం పెంపు)..
♦ రంగారెడ్డి జిల్లాలో : పాత విలువ రూ.1.01కోట్లు, కొత్త విలువ రూ.1.16 కోట్లు
♦ నల్గొండ జిల్లాలో : పాత విలువ రూ.2.25 లక్షలు, కొత్త విలువ రూ.3.93లక్షలు
♦ మిర్యాగూడలో : పాత విలువ రూ.4.5లక్షలు, కొత్త విలువ రూ. 6.75లక్షలు.
♦ కరీంనగర్ జిల్లాలో : పాత విలువ రూ.5.25లక్షలు, కొత్త విలువ రూ.6.03లక్షలు