Land prices increased : భూముల రేట్లు డబుల్.. మీ ఏరియాలో ఎంత పెరిగాయి? ఇలా చెక్ చేసుకోండి..
Land prices increased : రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
Land prices increased
Land prices increased : రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లన్నీ 5వ తేదీ నుంచి కొత్త విలువ ఆధారంగానే జరగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములు, ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువను 50 నుంచి 100శాతంకు పెంచగా.. అపార్టుమెంట్లకు సంబంధించి 10 శాతం నుంచి 20శాతం వరకు పెంపుదల జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పాత విలువనే కొనసాగించారు. అయితే, రాష్ట్రంలో కనిష్ఠంగా భూముల ధర ఇంతకుముందు ఎకరా రూ.1.75 లక్షలు ఉండగా దాన్ని రూ.2.75 లక్షలకు పెంచారు.
Also Read : Annamalai : అన్నామలై రాజీనామాను ఆమోదించిన బీజేపీ అధిష్టానం.. కొత్త పార్టీ పేరు అదేనా?
ఇలా చెక్ చేసుకోండి..
♦ తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లోకి వెళ్లండి. https://registration.telangana.gov.in/
♦ అందులో ఆన్ లైన్ సర్వీసెస్ అనే విభాగంలో మార్కెట్ వాల్యూ సెర్చ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి
♦ భూముల విలువ చెక్ చేయాలంటే Land Value మీద క్లిక్ చేయండి
♦ మీరు చెక్ చేయాలనుకున్న జిల్లాను ఎంచుకోండి
♦ ఆ తర్వాత మీరు చెక్ చేయాలనుకున్న మండలం పేరును సెలక్ట్ చేయండి
♦ ఏ గ్రామం/ పట్టణంలో మీరు లాండ్ రేట్ చూడాలనుకుంటున్నారో ఆ పేరు సెలక్ట్ చేసి SUBMIT క్లిక్ చేయండి
♦ మీకు కావాల్సిన డిటెయిల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఏ ఏరియాలో చదరపు గజం ఎంత ఉందో కనిపిస్తుంది.
అపార్ట్ మెంట్ మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలంటే..
♦ అపార్ట్ మెంట్ మార్కెట్ విలువ చెక్ చేయాలంటే Apartment Value అని ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేయాలి.
♦ ఆ తర్వాత ఏ జిల్లానో సెలక్ట్ చేయాలి.
♦ ఆ తర్వాత మండలం పేరు ఎంచుకోవాలి.
♦ ఏ గ్రామం/ పట్టణంలో ఉందో అది సెలక్ట్ చేయాలి.
♦ మీకు కావాల్సిన డిటెయిల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఏ ఏరియాలో చదరపు అడుగు ఎంత ఉందో కనిపిస్తుంది.
♦ ప్రభుత్వ మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువ వేర్వేరుగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రభుత్వ మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
