Legislative Council Chairman Gutta Sukhender Reddy
Legislative Council Chairman: కాంగ్రెస్ నాయకులు రైతాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రేవంత్, కోమటిరెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రేవంత్, కోమటిరెడ్డి లాంటివాళ్లకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అంటున్న రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్ధం అని, అసలు అప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నడో తెలియదని అన్నారు. అప్పుడు విద్యుత్ చార్జీలు పెంచుతామంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించారు. ఆ విషయం అందరికి తెలుసు. ఇప్పుడు రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నాడు.. అయినా రేవంత్ ఆరోపణలను ఎవ్వరు నమ్మరు అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు రైతులకు వ్యతిరేకమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎక్కడైనా పంట పొలాలు ఎండినయా? సబ్ స్టేషన్‌లలో ధర్నాలు చేశారా..? ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా విద్యుత్ అందుతుందని, తెలంగాణ సాగు పంటలతో సస్యశ్యామలం అయిందని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ అందుతున్న మాట వాస్తవం కాదా అని గుత్తా కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ళలో కుంభకోణం జరుగుతుంది అనేమాట హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ప్రయివేట్ సంస్థల నుంచి విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయడమే లేదని, ప్రభుత్వ సంస్థ NLDC నుండే విద్యుత్‌ను ప్రభుత్వం కొటుందని అన్నారు. అలాంటప్పుడు కుంభకోణం ఎలా జరుగుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
Revanth Reddy : తెలంగాణలో దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి గుడ్డకాల్చి మీదేస్తున్నాడని విమర్శించారు. ఇక.. కోమటిరెడ్డి అవరా నంబర్ 1 అని గుత్తా విమర్శించారు. వ్యవసాయం అంటే కోమటిరెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణ విజయాలు ప్రతిపక్షాలకు కనబడటం లేదా అని గుత్తా ప్రశ్నించారు. పొద్దునలేస్తే ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ పని. ప్రజలు సంతోషంగా ఉంటే కాంగ్రెస్‌కు నచ్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆరోపణలు చేయడం పద్ధతి కాదు. పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు. కోమటిరెడ్డికి మతిస్థిమితం లేదంటూ గుత్తా ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు కేంద్రం అడ్డుపడుతున్నదని, అనుమతులు ఇవ్వడం లేదని విమర్శించారు. BHEL ద్వారానే యాదాద్రి పవర్ ప్లాంట్ కడుతున్నారని, BHEL ని సీఎం కేసీఆర్ బతికించారని గుత్తా అన్నారు. కాంగ్రెస్ వస్తే వ్యవసాయం సర్వనాశనం అవుతుందని, తెలంగాణ ఆగమాగం అవుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.