Telangana Lockdown: ఖాళీగా సూపర్ మార్కెట్లు.. ఖాళీ అవుతున్న వైన్ షాపులు

తెలంగాణలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటూ మే12ఉదయం 10గంటల నుంచి పదిరోజుల పాటు ఉండనున్నట్లు తెలిపింది.

Telangana Lockdown: తెలంగాణలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటూ మే12ఉదయం 10గంటల నుంచి పదిరోజుల పాటు ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్లో పోస్టు చేశారు.

‘మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. గత లాక్ డౌన్ సమయంలో వైన్ షాపులు అందుబాటులో లేవని గుర్తించిన మందుబాబులు వైన్ షాపులపై దాడి చేసిన రీతిలో దూసుకెళ్తున్నారు. పర్సులు ఖాళీ చేసుకుని స్టాక్ ఉన్నంతవరకూ తీసుకెళుతున్నారు. పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో లేని కస్టమర్లు.. వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.

సూపర్ మార్కెట్లు ఖాళీగా ఉంటే.. వైన్ షాపులు ఖాళీ అయ్యేంతవరకూ వదలమంటున్నారు మందుబాబులు.

ట్రెండింగ్ వార్తలు