Metro Rail
Metro Station: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.