Drunkard Dead: నీళ్లు అనుకుని మద్యంలో యాసిడ్ కలుపుకుని తాగి వ్యక్తి మృతి
మద్యం మత్తులో మంచి నీళ్లు అనుకుని మధ్యంలో యాసిడ్ కలుపుకు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా మల్కల్ల గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది
- Bharath Reddy
- Published On : May 9, 2022 / 07:44 AM IST
Police
Drunkard Dead: మద్యం మత్తు నిండు జీవితాన్ని బలి తీసుకుంటుంది. మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మద్యం మత్తులో మంచి నీళ్లు అనుకుని మధ్యంలో యాసిడ్ కలుపుకు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా మల్కల్ల గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. హాజీపూర్ మండలం మల్కల్ల గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్ అనే వ్యక్తి స్థానిక సింగరేణిలో పనిచేస్తుండేవాడు. మద్యం సేవించే అలవాటు ఉన్న మహేష్..ఏప్రిల్ 18న మధ్యంలో మంచి నీరు అనుకుని యాసిడ్ కలిపి సేవించాడు.
Also Read:Sandal Stolen: రూ.180 విలువైన చెప్పులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు: అందులో పెద్ద ట్విస్ట్
అప్పటికే మద్యం మత్తులో ఉన్న మహేష్..యాసిడ్ కలిపి మద్యం సేవించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మహేష్ ను కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాదాపు 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన మహేష్ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. ఘటనపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read:Navneet Vs Thakrey: మరోసారి చిక్కుల్లో ఎంపీ నవనీత్ కౌర్.. మళ్లీ జైలుకు తప్పదా?
