Navneet Vs Thakrey: మరోసారి చిక్కుల్లో ఎంపీ నవనీత్ కౌర్.. మళ్లీ జైలుకు తప్పదా?

మహారాష్ట్రంలో శివసేన వర్సెస్ ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటిముందు

Navneet Vs Thakrey: మరోసారి చిక్కుల్లో ఎంపీ నవనీత్ కౌర్.. మళ్లీ జైలుకు తప్పదా?

Navaneet

Navneet Vs Thakrey: మహారాష్ట్రంలో శివసేన వర్సెస్ ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటిముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని చెప్పడంతో పోలీసులు నవనీత్ రాణా దంపతులను అరెస్టు చేసిన విషయం విధితమే. న్యాయస్థానం వారికి 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వారిని జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పది రోజుల తర్వాత దంపతులకు మంబై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Navaneet Kaur: నవనీత్‌ కౌర్‌కు సుప్రీంలో ఊరట.. ముంబై హైకోర్టు తీర్పుపై స్టే
జైలునుంచి వచ్చిన రెండు రోజులకే ఎంపీ నవనీత్, ఆమె భర్త రవి రాణా మరింత దూకుడు పెంచారు. మహారాష్ట్ర సీఎంపై నవనీత్ కౌర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీపై ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా, గెలుపు నాదే.. దమ్ముంటే నాతో పోటీ చేస్తావా? అంటూ సీఎం ఉద్దవ్ థాక్రేకు సవాల్ విసిరారు. హనుమాన్ చాలీసా పఠించడమే నేరం అయితే మరోసారి పఠించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. నవనీత్ కౌర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన నవనీత్ కౌర్.. షరతులను ఉల్లంఘించిందని మహారాష్ట్ర ప్రభుత్వం అంటోంది.
ఈ క్రమంలో మరోసారి నవనీత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అక్కడి పోలీసులు సిద్ధమయ్యారు.

Navaneet Kaur to SC : క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తా.. నవనీత్ కౌర్

ఇదిలాఉంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోమవారం నవనీత్ కౌర్ ఇంట్లో తనిఖీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖార్ లోని ప్లాట్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు రాణా దంపతులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతవారం తనిఖీలకోసం వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనక్కి వెళ్లిపోయారు. షరతులతో కూడిన బెయిల్ పై వచ్చిన నవనీత్ కౌర్ షరతులు ఉల్లంఘించడంతో ఎలాగైనా మరోసారి జైలుకు పంపించేలా శివసన చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో నవనీత్ కౌర్ మరోసారి జైలుకెళ్లడం ఖాయమన్న చర్చ మహారాష్ట్రలో సాగుతుంది.