Transgender Marriage
Kothagudem: కొత్తగూడెంలోని ఇల్లందులో జరిగిన ఓ కొత్త తరహా వివాహం చర్చనీయాంశంగా మారింది. ట్రాన్స్‌జెండర్‌ను వివాహమాడిన ఓ యువకుడు భర్తగా మారాడు. భూపాలపల్లి జిల్లాకు చెందిన గూడెపు రమేశ్ అనే వ్యక్తి ట్రాన్స్‌జెండర్ రేవతి(అఖిలా)తో ప్రేమలో పడ్డాడు.
అల్లాపల్లి మండలంలోని ఆనంతోగు గ్రామానికి చెందిన రేవతిని మూడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానికి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో స్టేషన్ బస్తీ ప్రాంతంలో శుక్రవారం ఘనంగా వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వివాహం చూసేందుకు విచ్చేశారు.
వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని పర్మినెంట్ చేసుకోవాలనే పెళ్లికి నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ కార్యక్రమం పూర్తయింది. ఈ వేడుకకు ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలకు చెందిన ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: తమిళనాడు ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ తొలి గెలుపు