తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ

  • Publish Date - July 16, 2020 / 12:52 AM IST

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 15 మందికిపైగా అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో రోజు వరుసుగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. నిన్న కొంతమంది జాయింట్ కలెక్టర్ల స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఇవాళ సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.

అడిషనల్ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ గా జ్యోతి బుద్ధప్రకాశ్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా కరుణ, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా రిజ్వి నియమితులయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా ఎల్.శర్మన్ ను నియమించారు. అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి నియామకం అయ్యారు. అటవీ శాఖ డీజీగా అదర్ సిన్హాను నియమించారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా శ్రీదేవసేనను నియమించారు.

కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఐ.రాణికుమిదిని, పర్యాటక శాఖ కార్యదర్శిగా కె.ఎన్.శ్రీనివాసరాజు, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా టి.విజయ్ కుమార్, ఎస్సీ అభివృద్ధి కమిషనర్ గా యోగితారాణాను నియమించారు. ఆదిలాబాద్ కలెక్టర్ గా సిక్తా పట్నాయక్ బదిలీ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఈ.శ్రీధర్ ను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శిగా కొనసాగిన శాంతకుమారిని ఆ స్థానం నుంచి తప్పించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా శ్రీధర్ కు మరోచోట కలెక్టర్ గా అవకాశం కల్పించారు. పెద్దపల్లి కలెక్టర్ ను కూడా బదిలీ చేశారు. ఆ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించారు. కాగా అదర్ సిన్హా, రజత్ కుమార్ లాంటి సీనియర్ ఐఏఎస్ లకు ఈసారి స్థానం చలనం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు