IAS Transfers
IAS Transfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం జరిగింది. కీలక శాఖల ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్‌ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయశాఖ కమిషనర్‌గా ఎం.హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి.దివ్యను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలు జిల్లా కలెక్టర్లనూ ప్రభుత్వం బదిలీ చేసింది.
♦ బి.విజియేంద్ర తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా నియమితులయ్యారు.
♦ దివ్య దేవరాజన్ సెర్ప్ (SERP) సీఈవోగా కొనసాగుతూనే ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు (FAC) చేపట్టనున్నారు.
♦ అద్వైత్ కుమార్ సింగ్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సమన్వయ శాఖ (GoI ప్రాజెక్ట్స్, CSS) ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
♦ ఎం.హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
♦ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్త పట్నాయక్
♦ జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా
♦ కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా పామెలా సత్పతి
♦ యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
♦ సహకార శాఖ స్పెషల్ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా రాహుల్ రాజ్
♦ ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న భవేష్ మిశ్రా అదే శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేట్ అయ్యారు.
♦ జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్
♦ గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా సంతోష్
♦ నారాయణపేట్ కలెక్టర్‌గా ప్రతీక్ జైన్
♦ మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీష్
♦ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కాత్యాయని దేవి
♦ నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా ఫణీంద్రా రెడ్డి
♦ కరీంనగర్ కలెక్టర్‌గా చైత్ర మిశ్రా
♦ రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా గరీమా అగర్వాల్
♦ వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారి
♦ మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్
♦ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్
♦ మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా కష్బూ గుప్తా
♦ హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్
♦ ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా కె.విద్యా సాగర్,
♦ ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా ఎం.సురేందర్
♦ జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా మందా మకరందు
♦ మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్
♦ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్
♦ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్
♦ వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉమశంకర్ ప్రసాద్
♦ నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ లాల్
♦ మంచిర్యాల అదనపు కలెక్టర్‌గా పి.చంద్రయ్య
♦ వరంగల్ అదనపు కలెక్టర్‌గా వైవీ గణేశ్
♦ సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా అబ్దుల్ హమీద్
♦ నిర్మల్ అదనపు కలెక్టర్‌గా బి.వెంకటేశ్వర్లు
♦ వనపర్తి అదనపు కలెక్టర్‌గా కీమ్యా నాయక్