Medchal: జొన్న రొట్టెలు చేస్తున్న మహిళను పొడిచి చంపిన దుండగుడు
మద్యం మత్తులో జొన్న రొట్టెలు చేసుకుంటున్న మహిళను పొడిచి చంపాడో దుండగుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
- Subhan Ali Shaik
- Published On : February 28, 2022 / 08:18 AM IST
Jonna Rottelu
Medchal: మద్యం మత్తులో జొన్న రొట్టెలు చేసుకుంటున్న మహిళను పొడిచి చంపాడో దుండగుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జగద్గిరిగుట్ట షిరిడీ హిల్స్‌కు చెందిన కవిత(35) తన ఇంటిముందే జొన్న రొట్టెలు చేసి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది.
గ్యాస్ సప్లయర్ అయిన యాదగిరి ఆల్విన్ కాలనీలో ఉంటున్నాడు.
జొన్న రొట్టెలు చేస్తున్న సమయంలో కవిత వద్దకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యాదగిరి ఆమెతో వాదనకు దిగాడు. అనంతరం మత్తులో కవిత మెడ, కడుపు భాగంలో కత్తితో పొడిచాడు.
Read Also: కత్తితో పొడిచి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ హత్య
స్థానికులు గమనించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కవిత మృతి చెందింది. పారిపోవడానికి యత్నించిన యాదగిరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
