Mega Job Fair: జేఎన్‌టీయూలో మార్చి 15న మెగా జాబ్ మేళా

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణలతో పాటుగా సాల్విక్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సహకారంతో మెగా జాబ్ ఫెయిర్ 2022ను..

Job Mela

Mega Job Fair: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణలతో పాటుగా సాల్విక్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సహకారంతో మెగా జాబ్ ఫెయిర్ 2022ను JNTU-హైదరాబాద్ వేదికగా మార్చి 15, మార్చి 16న నిర్వహించనున్నారు.

ప్రెస్ రిలీజ్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఐటీ, ఫార్మా, మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఇతర పరిశ్రమలకు చెందిన 150 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయి. Solvix కంపెనీ సీఈఓ పీ లక్ష్మీ మాట్లాడుతూ.. ‘మహిళలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని, ఉపాధి కోల్పోయిన వారిని తిరిగి పరిశ్రమలోనికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు.

ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల మధ్య జాబ్ ఫెయిర్ నిర్వహిస్తారు. ఆసక్తి కల వ్యక్తులు https://solvixskilldevelopment.com అనే వెబ్‌సైట్‌లో సంప్రదించాలి లేదా 8309662045ను కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది.

Read Also: రాష్ట్రంలో త్వరలో ఆన్ లైన్ లో జాబ్ మేళాలు