Mahabubnagar: మహబూబాబాద్ కలెక్టర్ బదిలీ.. సంబరాలు చేసుకున్న గిరిజన సంఘాలు
మెహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీపై గిరిజనుల సంబరాలు
- V Santhosh Kumar
- Published On : February 26, 2026 / 04:40 PM IST
Mehboobnagar Tribal celebrations about Collector Adwait Kumar Singh Transfer
Mahabubnagar: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను ప్రభుత్వం బదిలీ చేయడంతో మానుకోట జిల్లాలో సంబరాలు మొదలయ్యాయి. గత కొన్నేళ్లుగా కలెక్టర్ చేస్తున్న ఆకృత్యాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గిరిజనులు, ప్రజా సంఘాలు కలెక్టర్ బదిలీ వార్త తెలియడంతో సంబరాలు చేసుకున్నాయి. రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
గత రెండేళ్లుగా కలెక్టర్ అద్వైత్ కుమార్ జిల్లా(Mahabubnagar)లో అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని, స్వంత నిర్ణయాలతో జిల్లాను పదేళ్ల వెనక్కి నెట్టేశారని గిరిజన సంఘాలు ఆరోపించాయి. రైతుల సమస్యలు, భూ పట్టాదారు పాసుపుస్తకాల జాప్యం వంటి కీలక అంశాలపై అలసత్వం వహించని మండిపడ్డారు. కలెక్టర్‌కు వచ్చే ప్రత్యేక నిధులను పేద ప్రజల సంక్షేమం వినియోగించలేదని, ఇది జిల్లా ప్రజలకు చేసిన ద్రోహమని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య, విద్య రంగాల్లో తలెత్తే కనీస సమస్యలను కూడా ఆయన పరిష్కరించలేకపోయారని వివరించారు. ఆయనవల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అందుకే ఆయన బదిలీ పట్ల గిరిజన జిల్లా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.
