Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాలకు హెచ్చరికలు!

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు (Rain Alert)కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Meteorological Department announced Heavy rain alert in ap and tg for next two days.

  • రెండు రోజులు వర్షాలు
  • అధికారుల ముందస్తు హెచ్చరికలు
  • ఈదురుగాలుల తీవ్ర ప్రభావం

Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు(Rain Alert) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

Telangana Government: తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి లక్ష ఆర్ధిక సాయం.. డైరెక్ట్ అకౌంట్ లోకి

తెలంగాణ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు:

తెలంగాణలో రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ స్తంభాలు, పాత భవనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఏపీ తీర ప్రాంతాల్లో భారీ వర్ష సూచన:

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాగల రెండు రోజులు వర్ష ప్రభావం తీవ్రంగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.