Telangana Weather Updates : తెలంగాణలో భారీ వర్షాల అలర్ట్.. ఈ జిల్లాల్లో వారంరోజులు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ

Telangana Weather Updates : ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.

Telangana weather updates

  • తెలంగాణలో రెయిన్ అలర్ట్
  • ఈనెల 19 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ

Telangana Weather Updates : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉంది. దీంతో ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తాయని, వారం రోజులపాటు ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read : BRS Party : టార్గెట్‌ ఫిక్స్‌.. గ్రేటర్‌పై కారు స్పీడ్‌ అందుకేనా.? ఈసారి టికెట్లు వారికేనట..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో 54.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదై కావాల్సి ఉడగా.. 10శాతం లోటుతో 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈనెల 19నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది.

వారం రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బందితో నిరంతరం సమన్వయం కొనసాగించాలని, వరద ముంపు ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.