Telangana Heavy Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆరు రోజులు ఈ జిల్లాల్లో వానలేవానలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Telangana Heavy Rain Alert : తెలంగాణలో 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ సూచించింది.

Telangana Heavy Rain Alert

  • తెలంగాణకు రెయిన్ అలర్ట్..
  • నేటి నుంచి 27 వరకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
  • పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ

Telangana Heavy Rain Alert : తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే, తాజాగా వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతోపాటు.. ఉత్తర ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి, రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కోనసాగుతుందని, ఈ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వారం రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read : Kisan Credit Card New Rules : రైతులకు భారీ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2లక్షల రుణం.. ఆర్బీఐ నిబంధనల్లో కీలక మార్పులు

తెలంగాణ రాష్ట్రంలో నేటి (సోమవారం) నుంచి 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ విభాగం సూచించింది. సోమవారం నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబగద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వర్షం కురవనుందని తెలిపింది. అదేవిధంగా అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

జూన్ 25 ఉదయం నుంచి జూన్ 26 ఉదయం వరకు వర్షాల వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం దంచికొట్టే అవకాశం ఉందని పేర్కొంది.

అదేవిధంగా జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో పిడుగులతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో వేచిఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.