Kisan Credit Card New Rules : రైతులకు భారీ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2లక్షల రుణం.. ఆర్బీఐ నిబంధనల్లో కీలక మార్పులు
Kisan Credit Card New Rules : ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. స్వల్పకాలిక పంట రుణాల కాల పరిమితిని 12 నెలలుగా, దీర్ఘకాలిక పంట రుణాల కాలపరిమితిని 18 నెలలుగా నిర్ణయించారు.
Kisan Credit Card New Rules
- రైతులకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ
- తాకట్టు లేకుండానే రూ.2లక్షల రుణం
- కిసాన్ క్రెడిట్ కార్డు రూల్స్ సవరణ
- వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి
Kisan Credit Card New Rules : రైతులకు శుభవార్త. దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) పథకంలో కీలక మార్పులు చేసింది. రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో దేశవ్యాప్తంగా ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. స్వల్పకాలిక పంట రుణాల కాల పరిమితిని 12 నెలలుగా, దీర్ఘకాలిక పంట రుణాల కాలపరిమితిని 18 నెలలుగా నిర్ణయించారు. దీంతో రైతులు పంటల సాగు సమయానికి అనుగుణంగా రుణాలను వినియోగించుకునే అవకాశం లభిస్తుంది.
అదేవిధంగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకోసం రైతులు తీసుకునే రూ.2లక్షలలోపు రుణాలకు తాకట్టు, మార్జిన్ మనీ, అదనపు సెక్యూరిటీ నిబంధనలను తొలగించారు. గతంలో ఈ పరిమితి రూ.160 లక్షలుగా ఉండేది. అయితే, ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులకు సులభంగా రుణాలు అందే అవకాశం ఉంటుంది. ఇక పంటలు, పశుసంపద ఆధారంగా మంజూరయ్యే రుణాల విషయంలో రూ.3లక్షల వరకు తాకట్టు నిబంధనను మాఫీ చేసే వెసులుబాటు బ్యాంకులకు కల్పించారు. ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం ఆయా బ్యాంకుల అంతర్గత రుణ విధానాలపై ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
ఆర్బీఐ కొత్త నిబంధనలు అధిక శాతం మంది రైతులు రుణాలు పొందడంతోపాటు వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చినట్లవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
