MIM Rave Party : అశ్లీల నృత్యాలు, అమ్మాయిలతో చిందులు.. పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తల రేవ్ పార్టీ
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ కలకలం రేపింది. మజ్లిస్ కార్యకర్తలు ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చారు. ఫుల్లుగా మందు కొట్టారు.
- Naveen
- Published On : April 6, 2021 / 11:38 AM IST
Mim Rave Party
MIM Rave Party : హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ కలకలం రేపింది. మజ్లిస్ కార్యకర్తలు ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చారు. ఫుల్లుగా మందు కొట్టారు. ఆ తర్వాత అశ్లీల నృత్యాలు చేశారు. మద్యం మత్తులో మగువలతో చిందులేశారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎంఐఎం కార్యకర్తల అశ్లీల నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడు ఈ రేవ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న జరిగిన ఈ రేవ్ పార్టీలో సదరు నాయకుడికి చెందిన స్నేహితులు మద్యం సేవించి మహిళలతో చిందులు వేశారు. కాగా, రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పర్వేజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఘటన జరిగిన సమయంలో వెంటనే దాడి చేస్తే వివరాలు తెలిసేవని, ప్రస్తుతం కేవలం వీడియో మాత్రమే ఉన్నందున దానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయిలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాళ్లు ఇక్కడి వాళ్లేనా? లేక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.
