Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ‘సలార్’ సాంగ్ చూశారా.. సోషల్ మీడియాలో వైరల్.. కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ ఖుషీ..!

కోమటిరెడ్డి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో సలార్ సాంగ్ వినిపిస్తుంది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం గురించి సాంగ్ అద్భుతంగా ఉంటుంది.

komati reddy and Revanth Reddy

Komatireddy Venkat Reddy – Revanth : రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వీరిద్దరూ రాజకీయంగా ఒకే పార్టీ అయినా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం తరచూ చూస్తుంటాం. పలు దఫాలుగా వీరిద్దరి మధ్య పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ, బహిరంగంగానూ మాటల యుద్ధం సాగింది. అయితే, ఇందంతా ఒకప్పుడు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనసాగుతున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల తరచూ వీరిద్దరూ ఒకే వేదికలపై కనిపిస్తున్నారు.. ఒకరిపట్ల ఒకరు అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో ఇరువురు నేతల అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు సంతోషాన్నివ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : TS RTC : మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఆ రెండు టికెట్లు రద్దు

కోమటిరెడ్డి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో సలార్ సాంగ్ వినిపిస్తుంది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం గురించి సాంగ్ అద్భుతంగా ఉంటుంది.
‘వేగమొకడు… త్యాగమొకడు గతము మరువని గమనమే’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది. తాజాగా కోమటిరెడ్డి ఆ సాంగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, తన ఫొటోలను జతచేసి సరికొత్తగా క్రియేట్ చేసిన వీడియో షేర్ చేశారు. తద్వారా రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహాన్ని కోమటిరెడ్డి తెలియజేశారు. ఈ వీడియో ను చూసిన కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్, కోమటిరెడ్డి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.