Minister Koppula Eshwar : గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తాం : మంత్రి కొప్పుల ఈశ్వర్

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్ లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని మంత్రి  కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్ లో 5లక్షల31వేల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు.

Minister Koppula

Minister Koppula Eshwar : ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్ లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని మంత్రి  కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్ లో 5లక్షల31వేల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం (ఫిబ్రవరి12,2023) మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసన మండలిలో మాట్లాడుతూ 268 ఎస్సీ గురుకులాల్లో 1,53,863 మంది విద్యార్థులు, 310 బీసీ గురుకులాల్లో 1,65,110 మంది విద్యార్థులు, 183 ఎస్టీ గురుకులాల్లో 72,898 మంది విద్యార్థులు, 204 మైనారిటీ గురుకులాల్లో 125218 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారని వెల్లడించారు.

Minister KTR : 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నాం.. టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదు : మంత్రి కేటీఆర్

గురుకుల పాఠశాల పని వేళల మార్పుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్స్ కు పదోన్నతుల కల్పన ఆలోచన లేదని స్పష్టం చేశారు. గురుకులాలకు అద్దె భవనాలు సమస్య కాదని.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా? లేదా? అనేది మాత్రమే చూడాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి దశల వారిగా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు కృషి చేస్తామని చెప్పారు.

అంతకముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వసతుల కల్పన చేయకపోవడంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.