కోవాక్సీన్ బీహార్ కోసమే రిజర్వ్ చేశారట – కేటీఆర్
- madhu
- Published On : October 23, 2020 / 10:10 AM IST
Ktr:తాను కోవాక్సిన్ వేసుకోలేదు..అయినా..బీహార్ కోసమే రిజర్వ్ చేశారట ..అన్నారు మంత్రి కేటీఆర్. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. బీహార్‌లో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు, ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. వివిధ కార్యక్రమాలు, పనుల వల్ల ప్రజల్లో మంత్రి కేటీఆర్ తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు.
https://10tv.in/telangana-minister-ktr-visiting-flood-affected-areas/
కేటీఆర్ గారూ ఇటీవల మీరు భారత్ బయోటెక్‌ను సందర్శించారు కదా…కరోనా టీకా అయిన ‘కోవాక్సీన్’వేసుకున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇంతగా జనంలో తిరుగుతున్నా మీకు ఏమీ కాలేదు. లేదా ఇంకేదైనా కారణం ఉందా’ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. నేను కోవాక్సీన్ టీకా వేసుకోలేదు. అది బీహార్ కోసమే రిజర్వ్ చేశారట’ అని సమాధానం ఇచ్చారు.
Nope. Didn’t get any COVID vaccine shot; apparently it’s reserved only for Bihar? https://t.co/uR1QpCMzYj
— KTR (@KTRTRS) October 22, 2020
