Hyderabad LuLu Mall : కుకట్‌పల్లిలో లులు మాల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో మరో మాల్ అందుబాటులోకి వచ్చింది. కుకట్ పల్లిలోని కేబీహెచ్ బీ కాలనీలో లులు మాల్ ను మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Minister KTR Inaugurate Lulu Mall

LuLu Mall Hyderabad hyderabad kukatpally KPHB : హైదరాబాద్ లో మరో మాల్ అందుబాటులోకి వచ్చింది. కుకట్ పల్లిలోని కేబీహెచ్ బీ కాలనీలోని సరికొత్త మాల్ అందుబాటులోకి వచ్చింది. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన లులు మాల్ ను మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఏ పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరంలో ఎన్నో మాల్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దేని ప్రత్యేకత దానిదే. అటువంటి నగరంలోకి లులు వచ్చి చేరింది. ఈ మాల్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందని సంస్థ ప్రతినిధుతు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేబీహెచ్ బిలో ప్రారంభమైన ఈ మాలత్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభమైనట్లు అయ్యింది.

దాదాపు ఐదు లక్షల చదరపు విస్త్రీర్ణంలో ఉండే ఈ లులు మాల్‌.. రెండు లక్షల చదరపు అడుగుల హైపర్‌ మార్కెట్‌తోపాటు అత్యంత అధునాతన గ్లోబల్ రిటెయిల్‌ షాపింగ్ అనుభవాన్ని అందినుంది. నగరంలో కూకట్‌పల్లి ప్రాంతమంటే అదో జనారణ్యమనే చెప్పాలి. ఎప్పుడు అంత్యం రద్దీగా ఉండే కుకట్ పల్లి ఏరియాలో ప్రారంభమైన ఈ మెగా షాపింగ్ మాల్ నగరవాసులను ఆకట్టుకోనుంది. ఈ లులు మాల్ ప్రారంభంతో తెలంగాణలో లులు గ్రూప్‌కి ఇది మొదటి వెంచర్ అని చెప్పాలి. 2022లో మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా జరిగిన ఒప్పందంలో భాగంగా తెలంగాణలో భారీ పెట్టుబడుల హామీలో భాగంగా ఈ మాల్ ఏర్పాటు అయ్యింది.

లులు మాల్ ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..కేరళ నుంచి దుబాయ్ కు వెళ్లి 20కి పైగా దేశాల్లో లులు గ్రూప్ తమ కార్యకలాపాలను విస్తరించింది అని తెలిపారు. తెలంగాణలో లులు సంస్థ రూ.3500 కోట్ల పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా తెలంగాణ యువతకు ఉపాధి కల్పిస్తున్నారని..సంస్థకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే పెట్టుబడులు పెడుతాం అని తెలిపారని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఆక్వా, ఫార్మింగ్ వంటి వాటిలోను లులు పెట్టుబడులు పెడుతుందని లులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టటం చాలా సంతోషకరమని అన్నారు.