Double Bed Room Houses Opening Ktr
Double Bedroom House : హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో అంబేద్కర్ నగర్ లో కొత్తగా నిర్మించిన డబులె బెడ్‌రూం ఇళ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఇళ్లులేని నిరుపేదల కోసం ప్రభుత్వం రూ.28కోట్లతో 330 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించింది. ఒక్కో ఇంటిపై రూ. 8.50 లక్షలు ఖర్చు చేసి సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. ఈ మేరకు కేటీఆర్ ఇళ్లను ప్రారంభించారు.
అనంతరం లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల తాళాలు అందజేశారు. గతంలోనే లబ్దిదారులను అధికారులు గుర్తించి వారికి ఇళ్లు కేటాయించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభించటానికి వచ్చిన మంత్రి కేటీఆర్ కు స్ధానికులు బోనాలు, డప్పు చప్పుళ్లతో ఆహ్వానం పలికారు.