Minister Ponguleti Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు..
Minister Ponguleti Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది.
- Dharani Pilli
- Updated on- April 28, 2026 / 12:22 PM IST
minister ponguleti srinivasa reddy orders district collectors to speed up indiramma housing scheme
- ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త
- నిరంతర ప్రక్రియ
- అర్హులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు
Minister Ponguleti Indiramma Indlu : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారెంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. ఇది ఒకరకంగా చాలా మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ అని.. అర్హులైన దరఖాస్తుదారులు తొలి విడతలో రాకపోతే.. మళ్లీ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చని.. అర్హత ఉంటే తప్పకుండా ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
Also Read: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్ విడుదల ప్రకటన..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. పథకం అమలులో జాప్యాన్ని అరికట్టేందుకు.. అధికార వికేంద్రీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం అమలుపై జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తున్నామని తెలిపారు. వారు ఇకపై ప్రతి వారం హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. పథకం అమలులో వేగం పెంచేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని.. అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా.. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నియోజకవర్గానికి తొలి దశలో భాగంగా 3,500 ఇండ్లను కేటాయించామన్నారు. ఒకవేళ ఎవరైనా తమకు ఇల్లు అవసరం లేదని చెబితే, వారి స్థానంలో మరొక అర్హుడికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఇంటి బేస్‌మెంట్ పూర్తి చేసి, సాంకేతిక కారణాలతో బిల్లులు ఆగిపోయిన లబ్ధిదారులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
