TGSRTC Strike : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్.. చర్చలకు రండి.. చెడ్డ పేరు తేవాలని చూడొద్దు..
TGSRTC Strike : పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమ్మె విరమించి ఆర్టీసీ కార్మికులు చర్చలకు రావాలని పొన్నం కోరారు.
- Harishth Thanniru
- Published on- April 22, 2026 / 12:31 PM IST
Ponnam Prabhakar
- ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్‌పై చర్చలకు సిద్ధం
- సమ్మె విరమించి చర్చలకు రండి
TGSRTC Strike : ప్రభుత్వం నియమించిన కమిటీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో బుధవారం ఉదయం నుంచి సమ్మె షురూ అయింది. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సమ్మెపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : Rythu Bharosa 2nd Installment: రైతుభరోసాపై ప్రభుత్వం మరో కీలక అప్డేట్.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి..
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమ్మె విరమించి ఆర్టీసీ కార్మికులు చర్చలకు రావాలని పొన్నం కోరారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మెకు వెళ్లడం భావ్యం కాదని పేర్కొన్నారు. 32 సమస్యల్లో 29 పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చర్చించాల్సి ఉందన్నారు. వీటిపై అధ్యయనం చేసేందుకే నాలుగు వారాల గడువు అడిగామని వివరించారు. ఈ రెండు అంశాలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం స్థాయిలో చర్చిస్తామని అన్నారు. ఇప్పటికే సమస్యల పరిష్కారంకోసం కమిటీ కూడా వేశామని, చర్చలతో కాలయాపన చేసే ప్రభుత్వం మాదికాదని పొన్నం పేర్కొన్నారు.
ఆర్టీసీ బలోపేతానికి మేము ప్రయత్నిస్తున్నామని. ఆర్టీసీ సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానం ఉందని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారని మంత్రి పొన్నం పేర్కొన్నారు. మహిళల ఉచిత ప్రయాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు రాజకీయ నేతల మాయలో పడకుండా చర్చలకు రావాలని, చర్చలకు ఎప్పుడైనా సిద్ధమే.. సమ్మె విరమించి చర్చలకు రావాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
