ఆ మచ్చను తొలగించడానికి ఇప్పటికే అధికారులతో సమావేశాలు నిర్వహించాం: మంత్రి వాకిటి శ్రీహరి
"అది కరీంనగర్ నుంచి ప్రారంభిస్తాం. ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం" అన్నారు.
- T Venkateshwarlu
- Published on- July 7, 2025 / 03:15 PM IST
మత్స్య శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏటీఎంలా వాడుకున్నారని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.
“గతంలో మత్స్య శాఖలో జరిగిన అవినీతి వల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు. మొదటిసారి ముదిరాజ్ బిడ్డను ముఖ్యమంత్రి మత్స్య శాఖ మంత్రిని చేశారు. గతంలో ఉన్న అవినీతి మచ్చ తొలగించడానికి ఇప్పటికే అధికారులతో సమావేశాలు నిర్వహించాం.
మత్స్య శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతా. క్లిష్టమైన శాఖలు ఇచ్చారు. 80-110 mm ఉన్న చేపపిల్లలను పంపిణీ చేస్తాం. చేపలు ప్రకృతి ఇచ్చిన సంపద. త్వరలోనే కేబినెట్‌లో చేప పిల్లల పంపిణీపై నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో 87 కోట్ల చేపపిల్లలు వేసుకునే విధంగా చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు ఉన్నాయి. కరీంనగర్‌లో చేపల ఉత్పత్తి బాగా ఉంది.
Also Read: ‘భూమి చుట్టూ తిరుగుతున్న ఏలియన్ శాటిలైట్..? 13000 సంవత్సరాలుగా..’ మనపై నిఘా పెట్టారా!?
కరీంనగర్ పోరాటాల గడ్డ ఇక్కడి వారికి మంచి ఆలోచన విధానం ఉంది. ఇక్కడ చేప పిల్లల ఉత్పత్తి బాగుంది. దానిని మరింత విస్తరిస్తాం. పెరిగిన చేప రేటు వచ్చిన తర్వాత అమ్ముకునే విధంగా కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం.. అది కరీంనగర్ నుంచి ప్రారంభిస్తాం. ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం 82 కోట్ల చేపపిల్లలను విడుదల చేస్తాం.
ముదిరాజ్ కార్పొరేషన్, ఫిషరీస్ కార్పొరేషన్ లు కూడా ఉన్నాయి. తెలంగాణ చేపల ఉత్పత్తిలో నంబర్ 1గా ఉండేలా కృష్టి చేస్తాం. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచుతాం. విద్యా ఉద్యోగాల్లో కాకుండా రాజకీయాల్లో కూడా బడుగులకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ అన్నారు. కులగణన చేసే అవకాశం, బీసీ బిల్లు పెట్టే అవకాశం పొన్నం ప్రభాకర్‌కి దొరికింది. కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎంత అనేది శాస్త్రీయంగా తెలిసింది” అని తెలిపారు.
