Minister Srinivas Goud: కొందరు పొత్తులపై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.... కొందరు పొత్తులపై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తాము సీఎం కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు. బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేస్తుందని, తమకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

Srinivas Goud

Minister Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కొందరు పొత్తులపై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తాము సీఎం కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు. బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేస్తుందని, తమకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ను ఆ పార్టీ ఆ బాధ్యతల నుంచి తొలగించడం వారి పార్టీ నిర్ణయమని చెప్పారు. ఆయా అంశాలతో తమకే సంబంధం ఉండదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ నుంచి కూడా బీఆర్ఎస్ లో పలువురు నేతలు చేరిన విషయం తెలిసిందే. ఏపీలో చాలాకాలంగా పనులు జరుగుతున్న పోలవరం ప్రాజెక్టుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

పోలవరం విషయంలో కేసీఆర్ ఎవ్వరికీ నష్టం కలగకుండా పనులు పూర్తి చేయిస్తారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాగా, కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో పొత్తుల విషయంలో ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. వాటన్నింటినీ శ్రీనివాస్ గౌడ్ కొట్టి పారేశారు.

Viral video: ఒడ్డుకు చేరుకుని రెండు తిమింగళాల నుంచి తప్పించుకున్న సీల్