మాట నిలబెట్టుకున్న KTR

  • Publish Date - July 30, 2020 / 12:51 PM IST

తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను ఆరు కరోనా రెస్పాన్స్ అంబులెన్స్ లను ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అనుకున్నట్లుగానే…2020, జులై 30వ తేదీ గురువారం ప్రగతి భవన్ లో ఆరు అంబులెన్స్ లను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ కూడా పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు..కేటీఆర్ సతీమణి శైలిమ, కుమార్తె ఆలేఖ్య కూడా పాల్గొన్నారు.

KTR స్పూర్తితో పలువురు అంబులెన్స్ లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని అంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రోగులకు ఈ అంబులెన్స్ లను వాడనున్నారు.

కరోనా నేపథ్యంలో ఆరు అంబులెన్స్ ల కొనుగోలుకు అయ్యే ఖర్చును వ్యక్తిగతంగా భరిస్తానని, కరోనా టెస్టులతో పాటు..ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఉపయోగించుకొనేలా అన్ని సౌకర్యాలు ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సేవలు అందేలా చూడాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

దీనికి స్పందించిన మంత్రి ఈటెల…కరీంనగర్ టీఆర్ఎస్ పక్షాన 5 అంబులెన్స్ లను ఇస్తానని వెల్లడించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చారు. మొత్తంగా 32 జిల్లాలకు వంద అంబులెన్స్ లను నెల రోజుల్లో ఇవ్వాలని నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు