కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది.. ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి : మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేగిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ..

Telangana Assembly Session 2024

Telangana Assembly Session 2024 : తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేగిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిందని అన్నారు. కానీ, మేడిగడ్డ ప్రాజెక్టులో నిర్మాణ లోపం, అవినీతి వల్ల ఆ ప్రాజెక్టులు నేడు పనికిరాకుండా పోయిందని ఉత్తమ్ అన్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ ప్రాజెక్టు ఫొటోలు, వీడియోలను సభలో ప్రదర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కుంగిపోయిన రోడ్డు, బీటలు వారిన పిల్లర్లను సభలో ప్రదర్శించారు.

Also Read : బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఉత్తమ్ అసెంబ్లీలో మాట్లాడుతూ..
– కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్ లోపం ఉంది.
– ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులన్నీ గోదావరి పాలయ్యాయి.
– కాళేశ్వరం ప్రాజెక్టు నిషేధిత ప్రాంతంగా ఉండేది.
– ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి జరిగింది..
– కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎంతో ముఖ్యమైంది.
– డిజైన్, నిర్మాణ లోపాలు, ఓఅండ్ఎం పర్యవేక్షణ లోపం కారణంగా బ్యారేజీ కుంగిపోయింది.
– వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు.. మూడేళ్లకే దెబ్బతింది.
– మేడిగడ్డ ప్రాజెక్టులో నిర్మాణ లోపం, అవినీతి ఉంది.
– మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ. 1800 కోట్ల నుంచి రూ. 4,500 కోట్లుకు పెంచారు.
– అదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
– తుమ్మిడిహట్టి నుంచి చేవెళ్ల వరకు 600 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తిపోసే అవకాశం ఉండేది.
– తుమ్మడి హట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మించారు.
– తుమ్మడిహట్టి పూర్తయితే ఆసిఫాబద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాలలోని 2లక్షల ఎకరాలకు నీరు అందేది.

 

– కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని గత ప్రభుత్వం చెప్పుకుంది.
– కాళేశ్వరం రీ డిజైన్ పేరుతో లక్షా47 వేల కోట్లకు పెంచారు.
– కాగ్ కాళేశ్వర విషయంలో విస్తుపోయే విషయాలు కాగ్ చెప్పింది.

– తెలంగాణలో మొత్తం ఇతర అవసరాలకు రోజుకు వినియోగమయ్యే కరెంట్ 196 మిలియన్ యూనిట్లు.
– మొత్తం రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్ కంటే కాళేశ్వరానికి ఎక్కువ కావాలి.
– కాళేశ్వరం కరెంట్ బిల్లు ఏడాదికి రూ. 10వేల కోట్లు.
– కాళేశ్వరం నిర్వహణ ఏడాదికి 15వేల కోట్లు.. మొత్తంగా 25వేల కోట్ల భారం.
– కాగ్ సూచించిన అంశాలపై ఖచ్చితంగా విచారణ చేస్తాం.

అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం.. 

 

ట్రెండింగ్ వార్తలు