Chennamaneni Ramesh: టికెట్ విషయంలో నాకు భయం లేదు.. ఎందుకంటే?: ఎమ్మెల్యే చెన్నమనేని
టికెట్ విషయంపై తాను ధీమాగానే ఉన్నానని రమేశ్ బాబు చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : June 14, 2023 / 02:29 PM IST
MLA Chennamaneni Ramesh Babu
Chennamaneni Ramesh – BRS: తెలంగాణ(Telangana)లో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టికెట్ల విషయంపై నేతలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు మీడియాతో మాట్లాడారు.
టికెట్ విషయంపై తాను ధీమాగానే ఉన్నానని రమేశ్ బాబు చెప్పారు. సిట్టింగ్‌లకే టికెట్ అని కేసీఆర్ చెప్పారని అన్నారు. మంత్రి కేటీఆర్ తనతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారని తెలిపారు. కాబట్టి తనకు భయం లేదని, అధిష్ఠానం మంచి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఏది జరిగినా పార్టీ అధిష్ఠానం తమతో చర్చిస్తోందని అన్నారు.
ఇతరులు ఎవరో ఎదో చేసుకుంటే తమకు సంబంధం లేదని తెలిపారు. త్వరలో వేములవాడలోని 1,200 మంది అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తామని అన్నారు. వేములవాడ ప్రధాన బస్టాండ్ నుంచి గుడి వరకు రోడ్డు వైడింగ్ త్వరలో జరుగుతుందని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయం 90 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.
Gorantla Madhav : టీడీపీ, బీజేపీ అగ్ర నాయకులపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు
