MLC Elections : హైదరాబాద్ గాంధీభవన్ లో ఎమ్మెల్సీ ఆశావహుల హడావిడి కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు పలువురు ఆశావహులు వినతిపత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో గాంధీభవన్ కు వచ్చిన ఆశావహులు తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు.
దొంబాటి సాంబయ్యకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ కలిసి పీసీసీ చీఫ్ కు వినతిపత్రం ఇచ్చారు. తమకు అవకాశం ఇవ్వాలని సీనియర్ నేతలు జర్పేటి జైపాల్, గాలి అనిల్ కుమార్, ఈరవత్రి అనిల్, కొనగాని మహేశ్, పారిజాత నర్సింహారెడ్డి కోరారు.
Also Read : రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు..
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10 డెడ్ లైన్. ఆలోపు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తరపున నలుగురికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ టికెట్ కోసం సీనియర్ నేతలు గాంధీభవన్ కు క్యూ కట్టారు. తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పేరుని పరిశీలించాలని ఆశావహులు కోరుతున్నారు. రెండు మూడు రోజులు ఆశావహులు గాంధీభవన్ కు వస్తున్నారు. పీసీసీ చీఫ్ ని కలిసి వినతిపత్రం అందిస్తున్నారు.
వరంగల్ కు చెందిన దొంబాటి సాంబయ్య కోసం ఆయన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు గాంధీభవన్ కు వెళ్లారు. దొంబాటి సాంబయ్యకు అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ ను వారంతా కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కలేదని, అన్యాయం జరిగింది కాబట్టి, తనకు అవకాశం కల్పించాలని గాలి అనిల్ కుమార్ పీసీసీ చీఫ్ ను కోరడం జరిగింది.
Also Read : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి బిల్లులు సకాలంలో..
ఇవాళ కొనగాని మహేశ్, పారిజాతం నర్సింహారెడ్డి పలువురు నేతలు పీసీసీ చీఫ్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. రేపు ముఖ్యమైన నేతలంతా ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధిష్టానంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఈ క్రమంలో ఆశావహులు గాంధీభవన్ కు క్యూ కట్టారు. తమ పేరుని పరిశీలించాలని వారంతా కోరుతున్నారు.
మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ ల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తుంది. మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. మార్చి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ మార్చి 13. మార్చి 20న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుంది.