Teenmar Mallanna: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLC Teenmar Mallanna
Teenmar Mallanna: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పంపించిన సస్పెండ్ కాపీని ఫ్రేమ్ చేపించా. నన్ను కాంగ్రెస్ నుంచి పంపించడం ద్వారా బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ రెడ్డి భావించారు. కానీ, అలా కాదు. ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమం మామూలుది కాదని తీన్మార్ మల్లన్న అన్నారు.
కులగణన తప్పుల తడక అనేది నిజం. ఇప్పటికీ సర్వే విషయంలో ముఖ్యమంత్రికే చిత్తశుద్ది లేదు. ఆయనే సర్వేలో ఆఖరికి పాల్గొన్నాడు. ఈ సర్వే ఆదర్శవంతమైంది కాదు. తప్పుల తడక. అగ్రకులాలను ఎక్కువ చేసి చూపించారంటూ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. సర్వేలో 16లక్షల మంది పాల్గొనలేదంటున్నారు. అది ఎలా తెలుసు? సీఎం చెప్పిన లెక్కల్లో జనాభా లెక్కల్లో కరెక్ట్ కాదు. కేవలం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఈ సర్వేను ఉపయోగించుకోవాలని చూస్తున్నారని మల్లన్న ఆరోపించారు. 90ఏళ్ల తరువాత సర్వే చేస్తే ఒక్కరూ కూడా పాలాభిషేకం చేయలేదు. సర్వే విషయంలో రేవంత్ రెడ్డి డిబేట్ కు వస్తే ఎక్కడ తప్పు జరిగిందో నిరూపిస్తానంటూ తీన్మార్ మల్లన్న సవాల్ చేశారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలి. రాహుల్ గాంధీ పిలుపు మేరకు, ఆయన ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరా. ఏదైనా పనిచేస్తే తరతరాలు గుర్తించుకోవాలి. ఈ ముఖ్యమంత్రి పేరు క్యాబినెట్ మంత్రులకు కూడా గుర్తుండటం లేదంటూ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011లో రాహుల్ గాంధీ కూడా చేసిందే నేను చేశా. అన్యాయం జరిగితే గొంతెత్తాలని రాహుల్ చెబితే.. మీరు చేస్తున్నది ఏంటి? కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మల్లన్న రెక్కల కష్టంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి రావడానికి నేను కూడా కారణం. మా లక్ష్యం ఒక్కటే 2028లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ మల్లన్న అన్నారు.
మీరిచ్చే నోటీసులకు భయపడేవాన్ని కాదు. అన్ని పార్టీల్లోని బీసీలకు అన్యాయం జరిగితే ఇక నుంచి గొంతెత్తుతాం. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్లమెంట్ స్థానాలు గెలిపించిన. రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ గెలవలేదు. దీన్ని బట్టి ఎవరు ఎవరిని గెలిపించారో అర్ధమవుతుంది. కేసీఆర్ మీద నేను కొట్లాడుతున్నప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారంటూ మల్లన్న ప్రశ్నించారు. నన్ను సస్పెండ్ చేసినందుకు పెద్దగా బాధపడేది లేదు. రేపటి నుంచి గ్రామగ్రామానికి బీసీ వాదాన్ని తీసుకెళ్తాం. మీరిచ్చే నోటీసులకు భయపడేవాన్ని కాదు. రేపటి నుంచి గ్రామ గ్రామానికి బీసీ వాదాన్ని తీసుకెళ్తాం అంటూ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.