MLC Kavitha: ఈడీ నోటీసులకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. విచారణకు హాజరుకాలేనని వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
- Harishth Thanniru
- Published On : January 16, 2024 / 10:03 AM IST
MLC Kavitha
Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. 16వ తేదీన ఉదయం 11గంటలకు ఈడీ ఎదుట విచారణకు కావాలని సూచించింది. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కవితను ఇప్పటికే పలుసార్లు ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తాజా ఈడీ నోటీసులకు కవిత స్పందించారు. తాను విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, తాను విచారణకు హాజరుకాలేనని విచారణాధికారికి ఈ మెయిల్ ద్వారా కవిత తెలియజేశారు.
Also Read : Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు
గతంలో ఈడీ ఎదుట కవిత హాజరైన సమయంలో ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. తన ఎనిమిది ఫోన్స్ ను ఆ సమయంలో కవిత ఈడీకి సమర్పించారు. 2022 డిసెంబర్ అధికారులు కవితను మొదటిసారి విచారించారు. గతంలో వ్యాపారవేత్త అరుణ్ రాంచద్రన్ పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించారు. పిళ్లై అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. అంతకుముందే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేశ్ అరోరా, అ అప్రూవర్లుగా మారారు. ఇదిలాఉంటే .. కవిత విచారణకురానని చెప్పడంతో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్ చేస్తారా? విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
