Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు

రేపు తమ ముందు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటికే పలు సార్లు కవితను ఈడీ విచారించింది. ఇప్పుడు నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని ఆదేశించింది.

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు

Kavitha

Updated On : January 15, 2024 / 6:54 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు తమ ముందు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటికే పలు సార్లు కవితను ఈడీ విచారించింది. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఇప్పటికే అప్రూవర్‌గా మారిన విషయం విదితమే. అంతకుముందే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేశ్ అరోరా అప్రూవర్లుగా మారారు. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండడం, ఇదే సమయంలో మరోసారి ఈడీ నోటీసులు పంపుతుండం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద ఇప్పటికే కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు నమోదు చేశారు. సౌత్ గ్రూప్ నుంచి కవితను కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ పాత్రతో పాటు100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారాలు, నిందితులతో సంబంధాలు వంటి వాటిపై ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలపై కవితను ఈడీ ప్రశ్నించింది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌కు కూడా తాజాగా ఈడీ నాలుగోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు ఈ నెల 18న హాజరుకావాలని చెప్పింది. ఆయనకు మూడు నెలల వ్యవధిలో నాలుగుసార్లు నోటీసులు అందాయి.

 

 

Jupally Krishna Rao: దీన్ని రాజకీయంగా వాడుకోవాలని కేటీఆర్ చూస్తున్నారు: మంత్రి జూపల్లి