Jupally Krishna Rao: దీన్ని రాజకీయంగా వాడుకోవాలని కేటీఆర్ చూస్తున్నారు: మంత్రి జూపల్లి
ఆయనది భూ గొడవల వల్ల జరిగిన హత్య అని జూపల్లి కృష్ణారావు అన్నారు.

Jupally Krishna Rao
బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మల్లేశ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారని, ఇప్పటికే నిందితులను పోలీసులు రిమాండ్‌కు కూడా తరలించారని చెప్పారు.
దీన్ని మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని జూపల్లి కృష్ణారావు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇటువంటి హత్యా రాజకీయాలను ఎన్నడూ ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చారు. మల్లేశ్ మొదట బీజేపీలో పనిచేసి గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ చేరారని తెలిపారు.
ఆయనది భూ గొడవల వల్ల జరిగిన హత్య అని జూపల్లి కృష్ణారావు అన్నారు. దీనిపై కేటీఆర్ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తాము నేటి వరకు జరిగిన అన్ని ఆరాచకాలపై విచారణ చేపడతామని అన్నారు.
వామన రావు దంపతుల హత్యతో పాటు అర్మూర్‌లో జీవన్ రెడ్డిపై కేసు వేసిన తలారి సత్యం వంటి అంశాలపై కేటీఆర్ స్పందించాలని జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలపై తాము విచారణ జరిపిస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Vangaveeti Radha : టీడీపీలోనే వంగవీటి రాధా.. వైసీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ ..