Mancherial: కోతి మృతి చెందిందని.. ఆ ఊర్లో రచ్చ రచ్చ చేస్తున్న వానరాల గుంపు
మెడికల్ షాప్ సిబ్బంది నిర్లక్ష్యంతో షటర్ లో ఇరుక్కుని ఓ కోతి మృతి చెందింది.
- T Venkateshwarlu
- Published On : May 21, 2023 / 04:09 PM IST
Monkeys
Telangana: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ (Luxettipet) లో కోతులు స్వైర విహారం చేశాయి. మెడికల్ షాప్ పై దాడి చేశాయి. అనంతరం ఓ వీధిలోకి చేరుకుని స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మెడికల్ షాప్ సిబ్బంది నిర్లక్ష్యంతో షటర్ లో ఇరుక్కుని ఓ కోతి మృతి చెందింది.
అందుకే కోతుల గుంపు అక్కడ రచ్చ రచ్చ చేస్తోంది. ఆగ్రహంతో మెడికల్ షాప్ పై దాడి చేశాయి కోతులు. మెడికల్ షాపులోని సామగ్రి, మందులను చిందరవందర చేశాయి. మృతి చెందిన కోతిని పక్కనే ఉన్న గల్లీల్లోకి తీసుకెళ్లి రక్షణగా నిలిచాయి. కోతులను తరిమికొట్టేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.
ఘటనాస్థలం నుంచి కదలకుండా కోతులు కూర్చోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చుట్టూ ఉన్న ప్రజలను, దుకాణదారులను కోతులు బెదిరిస్తున్నాయి. పోలీసులు, స్థానికులు వానరాలను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. దీంతో వాటిని అక్కడి నుంచి తరలించే విషయంపై పోలీసులు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.
Worm in the chocolate bar : చాక్లెట్ లు తింటున్నారా? పురుగులు ఉంటున్నాయి జాగ్రత్త
