Nala Collapses in Hyderabad : గోషామహల్ చాక్నవాడిలో కుంగిన నాలా.. కుప్పకూలిన వాహనాలు,షాపులు, పలువురికి గాయాలు..

గోషామహల్ చాక్నవాడిలో 30 ఏళ్లక్రితం నిర్మించిన ఓ నాలా కుంగిపోయింది. దీంతో నాలాపై ప్రయాణించే కార్లు, బైకులు, ఆటోలు నాలాలో కుప్పకూలిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు.

Nala Collapses in Hyderabad : మనం రోడ్డుమీద వెళుతుండగా నాలా దాటానికి వంతెనమీదుగా ప్రయాణిస్తున్నామనుకోండి. అదే సయమంలో నాలా వంతెన కూలిపోతే..ఈ ఘటన ఊహించుకోవటానికే భయంవేస్తుంది. పైగా హైదరాబాద్ లో నాలాలు అంటే మురికి కంపు కొడుతుంటాయి. అటువంటి నాలా కూలిపోతే జరిగేది ఊహించుకుంటేనే గుండె గుభేలు మంటుంది. ఇదంతా ఎందుకంటే అదే జరిగింది హైదరాబాద్ లో. నగరంలోని ఓ నాలా కుప్పకూలిపోయింది. నాలాపై నిలిపి ఉంచి వాహనాలు,షాపులు కూడా నాలాలో పడిపోయాయి. దీంతో ఈ ప్రాంతమంతా హాహా కారాలతో నిండిపోయింది. అరుపులు,కేకలతో నిండిపోయింది.

శుక్రవారం (డిసెంబర్ 23,2022)  గోషామహల్ చాక్నవాడిలో 30 ఏళ్లక్రితం నిర్మించిన ఓ నాలా కుంగిపోయింది. దీంతో నాలాపై ప్రయాణించే కార్లు, బైకులు, ఆటోలు నాలాలో కుప్పకూలిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లుగా సమాచారం.నాలాపై ఉన్న దుకాణాలు కూడా నాలాలో పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై  సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. నాలా కూలిపోవటానికి గల కారాణాలను ఆరా తీశారు.

గోషామహల్‌లో రోడ్డుపై ఉన్న నాలా దాదాపు అరకిలోమీటరు కుంగిపోవటంతో నాలాపై నిలిపి ఉంచిన వాహనాలన్నీ దాంట్లో పడిపోయాయి. పైగా శక్రవారం కావటంతో ఆ ప్రాంతంలో వాంతపు మార్కెట్ (సంత) జరుగుతుంటుంది. ఈ నాలాపైనే చిరువ్యాపారులు కూరగాయాలు,ఇతర దుకాణాలు పెట్టుకుంటారు. నాలా కుంగిపోవటంతో దానిపై నిలిపిన వాహనాలతో పాటు దుకాణాలతో పాటు చిరువ్యాపారులు నాలాలో పడిపోయినట్లుగా తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు