Covid Telangana : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 1771 కేసులు, 13 మంది మృతి
- madhu
- Published On : June 12, 2021 / 07:36 PM IST
Covid Telangana
COVID 19 In Telangana : తెలంగాణలో ఇంకా కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1771 కేసులు నమోదయ్యాయని, 13 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలంగాణలో ప్రస్తుతం 22 వేల 133 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 469 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 171 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 2 వేల 384 మంది కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5 లక్షల 76 వేల 487గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 22 వేల 133 గా ఉంది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –
ఆదిలాబాద్ 07. భద్రాద్రి కొత్తగూడెం 107. జీహెచ్ఎంసీ 171. జగిత్యాల 44. జనగామ 15. జయశంకర్ భూపాలపల్లి 42. జోగులాంబ గద్వాల 21. కామారెడ్డి 02. కరీంనగర్ 99. ఖమ్మం 149. కొమరం భీం ఆసిఫాబాద్ 05. మహబూబ్ నగర్ 50.
మహబూబాబాద్ 73. మంచిర్యాల 57. మెదక్ 11. మేడ్చల్ మల్కాజ్ గిరి 104. ములుగు 33. నాగర్ కర్నూలు 25. నల్గొండ 157. నారాయణపేట 09. నిర్మల్ 03. నిజామాబాద్ 21. పెద్దపల్లి 82. రాజన్న సిరిసిల్ల 36. రంగారెడ్డి 85. సంగారెడ్డి 40. సిద్దిపేట 50. సూర్యాపేట 86. వికారాబాద్ 25. వనపర్తి 35. వరంగల్ రూరల్ 27. వరంగల్ అర్బన్ 64. యాదాద్రి భువనగిరి 36. మొత్తం : 1771
Read More : DPL Match : వికెట్లను తన్ని, పీకి పారేసి..తర్వాత క్షమాపణ చెప్పిన షకీబ్
