భారత ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం-1988 కొన్ని రాష్ట్రాలను మినహాయించి దేశ మొత్తాన్ని వణికిస్తోంది. తెలంగాణలోనూ రెండ్రోజుల్లో ఏ నిమిషంలోనైనా అమల్లోకి వచ్చే సూచనలున్నాయని ట్రాఫిక్ శాఖ వెల్లడించింది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి ప్రజలకు ముందుగానే తెలియజేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మెయిన్ జంక్షన్‌ల దగ్గర్నుంచి గల్లీ వరకూ వాహనదారులను ఆపేసి అవగాహన కల్పిస్తున్నారు. రోడ్‌పై వెళ్లేటప్పుడు జాగ్రత్తలతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ట్రాఫిక్ హోం గార్డు నుంచి ఇన్‌స్పెక్టర్ల వరకూ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్ రాచొకండ కమిషనరేట్లున్నా ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో మాత్రం సైబరాంబాద్ కమిషనరేట్ ప్రత్యేకతను చాటుకుంటోంది. మూడు కమిషరేట్లలో ఏటా సుమారు రూ. 180కోట్ల వరకూ జరిమానాలు విధిస్తున్నారు. వీటిలో కేవలం సైబరాబాద్‌లోనే రూ.100కోట్ల మార్కు దాటుతోంది. హైదరాబాద్ కమిషరేట్‌తో పోలిస్తే విస్తీర్ణం పరంగా సైబరాబాద్, రాచొకొండ కమిషరేట్ల పరిధి చాలా రెట్లు అధికంగా ఉంటుంది.
సైబరాబాద్ కమినరేట్ పరిధిలో ఐటీ కారిడార్ ఉండటంతో వాహనాల సంచారం ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కూడా ఈ కమిషరేట్ పరిధిలోనే ఉంది. ఈ క్రమంలోనే సైబరాబద్ ట్రాఫిక్ పోలీసులు మిగిలిన పోలీస్ యూనిట్లతో పోలిస్తే ఉల్లంఘనలకు ప్రమాదకర డ్రైవింగ్ సెక్షన్ ను జతచేసేవారు. ఇలా అదనంగా రూ.1000తోడై జరిమానాలు తడిసి మోపడయ్యేవి. ఔటర్ రింగ్ రోడ్‌పై వేగ పరిమితి దాటితే రూ.1400 చొప్పున జరిమానా విధించడంతో ఏటా కోట్లలోనే జరిమానాలు నమోదయ్యేవి. అలా బెంగళూరు ట్రాఫిక్ విభాగం తర్వాత దేశంలోనే ఎక్కువగా జరిమానాలు విధించే పోలీస్ యూనిట్ గా సైబరాబాద్ పేరు నమోదైంది.